విషయసూచిక
ముందుమాట
అధ్యాయము 1
1. యేసు క్రీస్తు, మన జీవము (యోహాను 1:1-4)
2. మనం దేవుని వలన జన్మించాలి (యోహాను 1:12-18)
3. అద్వితీయ కుమారుడైన యేసు ద్వారా దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడింది (యోహాను 1:15-18)
4. బాప్తిస్మమిచ్చే యోహాను సాక్ష్యమిచ్చిన సత్యమిదే (యోహాను 1:19-28)
5. యేసు లోక పాపములను భరించాడనటానికి బైబిల్ సాక్ష్యం (యోహాను 1:29-39)
6. దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్మే విశ్వాసం (యోహాను 1:1-8)
7. మనము ఇంతకన్నా సంతోషంగా ఉండలేము (యోహాను 1:29-31)
8. మన సృష్టికర్త ఎలాంటి రూపంతో మనల్ని సందర్శించాడు? (యోహాను 1:1-13)
9. బాప్తిస్మమిచ్చు యోహాను ఎవరు? (యోహాను 1:19-42)
అధ్యాయము 2
1. మనము యేసును మన హృదయాలలో అంగీకరించినట్లయితే మనము సంతోషిస్తాము (యోహాను 2:1-11)
2. మనం దేవుని వాక్యానికి లోబడితేనే మనం దేవుని ఆశీర్వాదాలను రుచి చూడగలం (యోహాను 2:5)
అధ్యాయము 3
1. ఈ విధంగా తెలుసుకోవడం మరియు నమ్మడం ద్వారా మనం క్రొత్తగా జన్మించాలి (యోహాను 3:1-6)
2. దేవుడు ఇచ్చిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను మీరు నమ్ముతున్నారా? (యోహాను 3:1-8)
3. మనం క్రొత్తగా జన్మించడం ఏలా సాధ్యమైంది? (యోహాను 3:1-15)
4. దేవుని ప్రేమ మీకు నిజంగా తెలుసా? (యోహాను 3:16)
5. విశ్వాసం ద్వారా ఆధ్యాత్మిక పని చేద్దాం (యోహాను 3:16-17)
యేసు క్రీస్తు ద్వారా దేవుని ప్రేమ వెల్లడి చేయబడింది
“ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయకుమారుడే ఆయనను బయలుపరచెను” (యోహాను 1:18).
దేవుని ప్రేమను యేసు మనకు ఎంత చక్కగా బయలుపరిచాడు! యేసు మనలను ఎంత పరిపూర్ణంగా విడిపించాడు! నీరు మరియు ఆత్మ యొక్క సువార్త రక్షణ ఎంత పరిపూర్ణ సత్యం! నీరు మరియు రక్తము ద్వారా వచ్చిన యేసుపై మన విశ్వాసం ద్వారా మన రక్షణను పొందినందుకు మేము ఎన్నడూ చింతించలేదు (1 యోహాను 5:6).
దేవుని ప్రేమను బయలుపరచిన యేసుక్రీస్తును మీరందరూ విశ్వసించి, ఆయన ప్రేమపై విశ్వాసాన్ని మీ హృదయాలలో ఉంచుకుని, ఆ ప్రేమను వ్యాప్తి చేయడం కోసం ప్రతిరోజు జీవించాలని నేను ఆశిస్తున్నాను. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా దేవునితో కలవడం ద్వారా మీరు పాప విముక్తి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను.